ప్రజెంట్ ఇప్పుడు సినిమా లవర్స్ ఎంతో ఇష్టంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద టాప్ సినిమాలలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 సినిమా కూడా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప వన్ సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది . సినీ చరిత్రను తిరిగి రాసిన ఘనత బన్ని దక్కించుకున్నాడు . ఫుల్ టు ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో లీనమైపోయినటించాడు . రీసెంట్ గానే పుష్ప సినిమాలో నటించినందుకు గాను..ఉత్తమ జాతీయ నటుడువంటి అవార్డు వరించింది.
కాగా ఈ క్రమంలోనే పుష్ప2 సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు . అయితే వాటికి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో పుష్ప2 సినిమా ఉండబోతుంది అంటూ చిన్న లీక్డ్ వీడియో ఇప్పుడు అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సోషల్ మీడియా పుణ్యమంటూ సినిమా రిలీజ్ కి ముందే కొన్ని కొన్ని సీన్స్ లీకై అభిమానులకు హై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. కాగా పుష్పవన్ సినిమా ఏ రేంజ్ లో లీకై సెన్సేషనల్ హిట్ అయిందో మనకు తెలిసిందే.
ఇప్పుడు పుష్ప2 మానియా స్టార్ట్ అయింది. పుష్ప2 నుంచి రీసెంట్గా సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బోలెడన్ని లారీలు వరుసగా ఉండడం మనం గమనించవచ్చు . అయితే ఈ సీన్ చూస్తుంటే కచ్చితంగా ఈసారి పుష్ప గాడు తెగించేసి మరి విలన్స్ తాట తీసేసాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు పుష్ప వన్ అనుకుంటే పుష్ప2 దానికి మించిన రేంజ్ లో ఉందని .. ఖచ్చితంగా ఈ సినిమా బన్నీ కెరియర్ లోనే మరో మైల్ స్టోన్ క్రియేట్ చేయబోతుందని చెప్పుకొస్తున్నారు . దీనితో సోషల్ మీడియాలో పుష్ప2 హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది . అంతేకాదు ప్రెసెంట్ ఈ లీక్ అయిన వీడియో పిక్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!