హనీ రోజ్ దెబ్బతో పాన్ ఇండియా మూవీ బ్యాన్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో అబ్బాయిల కలల రాణిగా మంచి పాపులారిటీ సంపాదించింది. అదిరిపోయే ఫిజిక్కుతో తన ఒంపు సొంపులతో గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేసింది. వీర సింహారెడ్డి సినిమా తర్వాత మరే తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Honey Rose opens up about viral first-look poster of 'Rachel', says she's  glad to play a strong character | Interviews | Onmanorama

పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూనే భారీగా సంపాదిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హనీరోజ్ మాట్లాడుతూ రాహేలు అనే పాన్ ఇండియా చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఈ సినిమా తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తమకు సపోర్ట్ చేస్తున్న అభిమానానికి అందరికీ ధన్యవాదాలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తను నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని తెలిపింది. అయితే రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యింది.

బోల్డ్ లుక్ లో కుర్రాళ్లను పిచ్చెక్కించే హనీ రోజ్ ఈ సినిమాలో బీఫ్ అమ్మే మహిళగా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. దీంతో పలు సామాజిక సంఘాల నుంచి నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మలయాళం సినిమాలు బీఫ్ నేపథ్యం కానీ అందుకు సంబంధించిన సన్నివేశాలు గాని న్యాచురల్ గానే చూపిస్తారట. ఈ పోస్టర్లో కత్తి పట్టుకొని హని రోజ్ బీఫ్ మాంసం కొడుతూ ఉన్నట్టుగా చూపించారు. అంతేకాకుండా దున్నపోతు తలకాయలు కూడా ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఆపేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆనంది బాల తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం హనీ రోజు 70 లక్షల రూపాయలు తీసుకుందని టాక్ వినిపిస్తోంది.