అలాంటి టైంలో భర్త వేరే మహిళతో ఉన్నా తప్పులేదు.. హైకోర్ట్‌ సెన్సేషనల్ తీర్పు…!

ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఒక కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు భర్త మరొక మహిళతో సహజీవనం చేసినంత మాత్రాన అతను భార్యకు విడాకులు ఇచ్చే హక్కును కోల్పోలేదని వ్యాఖ్యానించింది. భార్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 2005 నుంచి విడివిడిగా జీవిస్తున్న దంపతులకు మళ్ళీ కలిసే అవకాశం ఇవ్వమంటూ ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చిన తీర్పులో ఢిల్లీ కోర్ట్ ఏకీభవించింది. అతని కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టడం, వారితో నిత్యం గొడవలు పడ‌టం ద్వారా భర్త జీవితాన్ని నరకంగా మార్చిందని కోర్టు భావించింది.

ఇక భార్య వల్ల ఎలాంటి క్రూరమైన సమస్యలను స్పష్టంగా పేస్ చేశాడు వాటిని పరిష్కరించే మార్గం లేదని కోర్టు అభిప్రాయపడటంతో భార్య‌ నుంచి విడాకులు తీసుకోకుండా భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడా లేదా అనేది మాట్లాడుకోకపోవడమే మంచిదని వివరించింది. ఎందుకంటే చాలా కాలం పాటు విడిపోయి.. తిరిగి కలుసుకొని ఆశలేనప్పుడు భర్త వేరొక మహిళతో సహ‌జీవ‌నం చేసినంత మాత్రాన తప్పు లేదని కోర్ట్‌ భావించింది. భర్త మానసిక వేదనకు గుతై భార్యతో దాంపత్య సంబంధాన్ని కొనసాగించ లేడని గ్రహించింది.

విడిపోయిన తర్వాత మరో మహిళతో కలిసి జీవించాలని భర్త తీసుకున్న నిర్ణయం విడాకుల హక్కు పై ఎలాంటి ప్రభావం చూపించమని కోర్టు భార్యకు వివరించింది. విడాకులు తీసుకోలేనంత తప్పు అతడు చేసినట్లు తీర్పు ఇవ్వడానికి కారణాలేం లేనట్లు ఢిల్లీ కోర్టు నిర్దారించింది. భార్య భర్త పట్ల కౄరంగా ప్రవర్తించిందని కిందికోర్ట్‌ చెప్పడం సరైనదేనని ఆమె అఫీసులో తోసిపుచ్చింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్ట్‌ నిర్ణయాన్ని అంగీకరించని భార్య.. భర్తల పై దారుణంగా అబద్ధాలు చెబుతున్నాడని వివరించింది.

మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని కూడా చెప్పింది. అయితే భర్త రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు సమాచారం లేవని కోర్టు వివరించింది. భార్య.. భర్త పట్ల కౄరంగా ప్రవర్తించినట్లు రుజువైతే భర్త కోరే విడాకులకు నో చెప్పలేమని తీర్పు చెప్పింది. భార్య తన పట్ల కౄ రంగా ప్రవర్తించింది రుజువు అయితే మాత్రం భర్త మరొక స్త్రీ తో సహజీవనం చేసినప్పటికీ విడాకులు మంజూరు చేయవచ్చని ఈ కేసు చెప్పకనే చెప్పింది.