ప్రపంచంలోనే మోస్ట్ ఇంపాజిబుల్ డాన్స్ మూమెంట్‌ ఇదే.. !

డ్యాన్స్ చేయడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ కొందరు మాత్రమే గ్రేస్ ఫుల్ డాన్స్ చేయగలుగుతారు. కొన్ని నెలలపాటు శిక్షణ పొందితేనే ఇది సాధ్యమవుతుంది. కానీ అత్యంత కష్టమైన నృత్య రూపంలో పిలవబడుతున్న జౌళి డ్యాన్స్ ను నేర్చుకునేందుకు మినిమం 5 ఏళ్ళు పడుతుందట. అయినా పర్ఫెక్ట్ గా రావడం చాలా కష్టమని ఇప్పటికే అంగీకరించబడింది.

ప్రపంచంలోనే మోస్ట్ ఇంపాజిబుల్ డాన్స్ గా ఈ జోలీ డాన్స్ గుర్తించబడింది. కాగా జౌలీ అనేది పశ్చిమ ఆఫ్రికాలోని గురవ తెగకు చెందినవారు ప్రదర్శించే సంగీతంతో కూడిన ప్రసిద్ధి నృత్య రూపం. ఇందులో ప్రదర్శన కారుడు సాధారణంగా కాళ్ళను కదిలించడం ద్వారా మాత్రమే నృత్యం చేస్తాడు. ఈ డాన్స్ ఫామ్ లో శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా ఒక ఆర్ట్.

కాగా మ్యూజిక్ స్పీడ్ కు తగినట్లుగా వేగంగా కాళ్లు కలపాలిసి ఉంటుంది. అంతే కాదు కొరియోగ్రఫీ ఒకేలా కనిపిస్తుంది. కానీ సింగిల్ స్టెప్ కూడా రిపీట్ కాదు. డ్రెస్, డాన్స్, మ్యూజిక్, మాస్క్ లాంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ ఆర్ట్ లో డాన్సర్స్ ఏడు రకాల మాస్కులు ధరిస్తారు. సామాజిక సందేశానికి కూడా ప్రసిద్ధి చెందిన ఈ డాన్స్ మ‌హిళా సౌందర్యాన్ని నివాళి అని యునెస్కో వివరించింది.