హాట్ టాపిక్ గా మారిన నయనతార రెమ్యూనరేషన్..!!

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా నటించిన చిత్రం జవాన్.. మొదటిసారి ఒక తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.ఈ సినిమాల్లో షారుఖాన్ ని చూపించిన విధానం కూడా అభిమానులను ఫిదా అయ్యేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో షారుక్ శాసన నయనతార నటించిన విషయం తెలిసింది ఈమె నటనకు కూడా ప్రశంశాల వర్షం అందుకున్నది.

Did you know Nayanthara rejected Jawan co-actor Shah Rukh Khan's Chennai  Express? | PINKVILLA

ఈ సినిమా విడుదల తర్వాత నయనతార కు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అది ఏమిటంటే రెమ్యూనరేషన్ కు సంబంధించిన విషయం.. ఈ చిత్రంలో నయనతార నటించినందుకు గాను రూ .11 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ రెమ్యూనరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని కూడా అభిమానులు తెలియజేస్తున్నారు ఎందుకంటే దక్షిణాది లో నయనతారకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

Nayanthara Bollywood Debut: 'Lady Superstar Goosebumps' say netizens on her  role in Shah Rukh Khan's Jawan | PINKVILLA

దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరుపొందింది..ఈ సినిమాకి మరింత ఎక్కువ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా ఇమే అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి సంగీతాన్ని అనురుద్ అందించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా మారడంతో పాటు పాటలు కూడా బాగుండడంతో ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. జవాన్ సినిమాతో నయనతార మొదటిసారిగా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది.