బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తున్న `ఖుషి`.. 4 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. లైగ‌ర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ కొట్టాల‌ని ఎంతో ఆశ‌ప‌డ్డారు. కానీ, ఈ సినిమా దారుణ‌మైన డిజాస్ట‌ర్ అయింది. అయితే తాజాగా విడుద‌లైన ఖుషి విజ‌య్ ను మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కింది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది.

గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఖుషి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తుంది. అద్భుత‌మైన వ‌సూళ్ల‌తో వీకెండ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. వ‌ర్కింగ్ డేస్ లోకి ఎంట‌ర్ అయింది. అయినా కూడా త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతోంది.

నాలుగో రోజు అయిన సోమ‌వారం ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.05 కోట్లు, వరల్డ్ వైడ్ గా రూ. 2.33 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఖుషి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53 కోట్లు. అయితే విడుద‌లైన నాలుగు రోజుల్లో రూ. 34.86 కోట్లు షేర్‌, రూ. 65.05 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను ఖుషి సాధించింది. ఇంకా రూ. 18.64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే ఖుషి క్లీన్ హిట్ అవుతుంది. కాగా, ఏరియాల వారీగా ఖుషి 4 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 11.86 కోట్లు
సీడెడ్: 2.09 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.57 కోట్లు
తూర్పు: 1.31 కోట్లు
పశ్చిమ: 1.04 కోట్లు
గుంటూరు: 1.30 కోట్లు
కృష్ణ: 1.15 కోట్లు
నెల్లూరు: 0.64 కోట్లు
—————————
ఏపీ+తెలంగాణ‌= 21.96 కోట్లు(36.20 కోట్లు~గ్రాస్‌)
—————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 2.70 కోట్లు
ఇతర భాషలు: 2.40 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 7.80 కోట్లు
—————————
టోటల్ వరల్డ్ వైడ్ = 34.86 కోట్లు(65.05 కోట్లు~ గ్రాస్)
—————————