వామ్మో చంద్రముఖి-2కి కంగనా రనౌత్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?

ఏ ఇండస్ట్రీలో నైనా సరే సీక్వెల్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలా కోలీవుడ్లో చంద్రముఖి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి-2 గా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చంద్రముఖి మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగానే ఉంది. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. అయితే ఈ సినిమాకు గాను ఈమె దాదాపుగా రూ.20 కోట్లకు పైగా రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Kangana announces Chandramukhi 2 release date, shares Raghava Lawrence's  look - Hindustan Times

కంగనాకు కాస్త యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంత మొత్తంలో ఇవ్వడంతో పలువురు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈమెకు ఇచ్చే రెమ్యూనరేషన్లు ఒక మీడియం బడ్జెట్ సినిమాని తీయవచ్చు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కంగనా రనౌత్ సక్సెస్ రేటు కూడా చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈమెకు అవకాశం ఇవ్వడం వల్ల లాభం కంటే కాస్త నష్టమే ఎక్కువగా ఉందని పలువురు నెటిజన్స్ తెలియజేస్తున్నారు. వేరువేరు వివాదాలలో సైతం ఎప్పుడూ కూడా ఈమె వైరల్ గా మారుతూ ఉంటుంది.

ముఖ్యంగా చంద్రముఖి సీక్వెల్ నుంచి వచ్చిన ఏ అప్డేట్ కూడా ఈ సినిమా అంచనాలను పెంచలేకపోతోంది చంద్రముఖి సినిమా ఒక క్లాసికల్ అని ఈ సినిమాకు సీక్వెల్ తీసి మెప్పించడం అనేది ఒక సాహసం అని చెప్పవచ్చు.రాఘవ లారెన్స్ ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకొని రిస్కు చేస్తున్నారని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు.. అయితే అదే రోజున స్కంద , పెదకాపు, తదితర చిన్న సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి మరి ఈ సినిమాలన్నిటిని మించి చంద్రముఖి-2 మెప్పిస్తుందేమో చూడాలి మరి.