చైతన్యను మిస్ అవుతున్న స్యామ్‌.. ఇన్‌స్టాలో కనిపించిన పెళ్లి పిక్‌.. మళ్లీ ప్రేమ చిగురించిందా..

సమంత – నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా లో కలిసిన నటించిన సంగతి తెలిసిందే. సమంతకు టాలీవుడ్ లో ఇది మొదటి సినిమా. ఈ సినిమాతో ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది. ఒకరితో ఒకరు ప్రేమలో పడిన ఈ జంట కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత రెండు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. సమంత క్రిస్టియన్, నాగచైతన్య హిందూ అయినప్పటికీ వీరి పెళ్లికి ఎటువంటి మతాలు అడ్డు రాలేదు.

ముందుగా క్రిస్టియన్ పద్ధతిలో తర్వాత హిందూ పద్ధతిలో రెండు విధాలుగాను గ్రాండ్గా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోనికి అడుగుపెట్టారు. ఏవో మనస్పర్ధలు కారణంగా కొంతకాలానికే విడిపోయారు. అయితే సమంత ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి పెళ్లి ఫోటోలను ఎవరికి కనపడకుండా ఎర్చివ్‌లో() పెట్టింది. ప్రస్తుతం సమంత చైతన్య ఇద్దరూ ఎవ‌రి కెరీర్‌ను వాళ్ళు చూసుకుంటూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తో సమంత జంటగా నటించిన ఖుషి మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

కలెక్షన్ల విషయంలో కూడా పర్వాలేదు అనిపించిన ఈ సినిమా తో విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని ఫాన్స్ తో షేర్ చేసుకున్న‌డు. ఇక నాగచైతన్య మాత్రం ఇంకా హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ టైంలో సమంత ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెళ్లి ఫోటో ఒకటి ప్రత్యక్షమైంది. అందులో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న శ్యామ్.. చైతుకి ఘాటుగా ముద్దు పెడుతున్నట్లు కనిపించింది. దీంతో అది చూసిన నటిజెన్లు సమంత చైతన్యన్ని మిస్ అవుతుందని అందుకే పెళ్లి ఫోటోను మళ్ళీ ఎర్చివ్‌లో నుంచి తీసేసిందని.. మళ్లీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించబోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)