కలర్ స్వాతి తో పెళ్లి పై.. హీరో నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ కలర్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈమె నటించిన మంత్ ఆఫ్ మధు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాని శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం తో పాటు నటీనటులు పాల్గొనడం జరిగింది. ఇలాంటి సమయంలోనే గతంలో తన పెళ్లిపై వచ్చిన రూమర్స్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.

గతంలో నటుడు నవీన్ చంద్ర, స్వాతి వివాహం చేసుకున్నారంటూ తెగ వార్తలు వినిపించాయి.. ఒక ఇంటర్వ్యూలో హీరో నవీన్ చంద్ర కూడా ఈ విషయం పైన మాట్లాడుతూ ఆ రూమర్లు రావడానికి గల కారణాలను తెలిపారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ త్రిపుర సినిమా కోసం మొదటిసారి స్వాతితో కలిసి పనిచేశాను ఆమె చాలా మంచి వ్యక్తి ఇక ఇరువురు కుటుంబాల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది త్రిపుర సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం మొదటిసారి ఒక ఫోటోని విడుదల చేయడం జరిగింది..

ఆ ఫోటోలలో స్వాతి తను పెళ్లి బట్టలలో కనిపిస్తామంటూ తెలిపారు.దాన్ని చూసి చాలామంది నిజం గానే మేమిద్దరం వివాహం చేసుకున్నాం ఏమో అనుకున్నారు.. కొందరు తనకి ఫోన్ చేసి మీకు వివాహం అయ్యిందా అని అడిగేవారు.. అలాంటి వాటిని మాత్రం నేను స్వాతి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి చిత్ర బృందం వాటిని పోస్టర్ రూపంలో విడుదల చేయడం జరిగింది. అప్పుడు అందరికీ క్లారిటీ వచ్చిందని తెలిపారు నవీన్ చంద్ర. మంత్ ఆఫ్ మధు సినిమా గురించి మాట్లాడుతూ ఇదొక మంచి గుడ్ ఫిలిం అని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి తెలియజేస్తుందని తెలిపారు. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.