వామ్మో షారుక్ జవాన్ ఓటీటి రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. నయనతార హీరోయిన్గా నటించగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ప్రియమణి ,దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. దాదాపుగా 10000 వేల థియేటర్ల విడుదలైన జవాన్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మొదటి షో నుంచి పాజిటివ్ టాకుతో మూటకటుకుంది. ఇప్పటివరకు రూ 530 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది.

Shah Rukh Khan-starrer 'Jawan' grabs OTT, music, and satellite rights at  record price | Entertainment News | Onmanorama

ఈనెల 7వ తేదీన బాక్స్ ఆఫీస్ వద్ద బరిలో దిగిన జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. వీకెండ్ ముగిసేసరికి జవాన్ చిత్రం 1000 కోట్లు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న జవాన్ సినిమాకు ఇప్పుడు మరొక జాక్ పాట్ తగిలినట్లుగా తెలుస్తోంది.. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం.

జవాన్ సినిమా కోసం ఏకంగా ఈ ఓటీటి సంస్థ రూ .230 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారకంగా ప్రకటించలేదు స్ట్రిమ్మింగ్ తేదీని కూడా ప్రకటించలేదు. ఈ చిత్రానికి థియేటర్లో లభిస్తున్న రెస్పాన్స్ ను బట్టి ఓటీటి రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉందని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.