ఆ చిన్న తప్పే సిల్క్ స్మిత మరణానికి కారణమయ్యిందా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో డిసెంబర్ 2-1960లో ఈమె జన్మించింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి తమిళ ఇండస్ట్రీలో తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత మలయాళం తెలుగు, కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజీ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా మునిగిపోవడానికి ఒక చిన్న తప్పు కారణమన్నట్టుగా తెలుస్తోంది.

Silk Smitha's death continues to be a mystery even after 24 years | Telugu Movie News - Times of India

సిల్క్ స్మిత దాదాపుగా 400కు పైగా సినిమాలలో నటించింది కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చిన్న వయసులోనే చదువు వదిలేసి వివాహం చేసుకుంది. అలా 14 ఏళ్లకే వివాహం చేసుకున్న సిల్క్ స్మిత తన అత్తమామలు ఆమెను వేధించే వారట ఆ వేధింపులు భరించలేక ఆమె ఇల్లు వదిలి పారిపోయి వచ్చిందట.. అలా మేకప్ ఆర్టిస్ట్ అయినా తన స్నేహితురాలు వద్దకు వచ్చిన సిల్క్ స్మిత తన స్నేహితురాలి సహాయంతో కలిసి సినిమా సెట్స్ కి వెళ్ళేది కొన్ని నెలలకి మేకప్ ఆర్టిస్టుగా పనిచేయడం ప్రారంభించింది అంట సిల్క్ స్మిత.

అలాంటి సమయంలోనే డైరెక్టర్ ఆందోని ఈస్ట్మన్ అనే చిత్రానికి ఈమెకు ఒక అవకాశం ఇచ్చారట.అదే సిల్క్ స్మిత జీవితంలో ఒక మలుపు అని చెప్పవచ్చు.ఇది ఈమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ తర్వాత తమిళ డైరెక్టర్ విను చక్రవర్తి కూడా ఈమెకు ఇంగ్లీష్ డాన్స్ నటన నేర్పించే అవకాశం కల్పించారు. అప్పటి నుంచి తన కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. స్టార్ హీరోల సినిమాలను నటించిన ఈమె ఎన్నో భాషలలో నటించి మైమరిపించింది. వ్యక్తిగత జీవితంలో మాత్రం సిల్క్ స్మిత ఫెయిల్యూర్ గా మిగిలింది.. ఆ తరువాత ఒక వైద్యుడిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె సంపాదన అంతా సినిమాల మీద పెట్టుబడి పెట్టడంతో ఆ సినిమాలన్నీ ఫెయిల్యూర్ గా నిలబడ్డాయి.. ఆ తర్వాత ఎవరు ఊహించని రీతిలో సెప్టెంబర్ 23..1996 ఒక హోటల్లో ఆత్మహత్య చేసుకుంది సిల్క్ స్మిత. నిర్మాతగా మారడం వల్లే ఈమె మరణానికి కారణమని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.