మీరు మద్యం తాగుతున్నారా.. అయితే మీ పిల్లలలో ఆ సమస్య..!!

ఈ మధ్యకాలంలో చాలా మంది ట్రెండ్ కు తగ్గట్టుగా అలవాట్లను మార్చుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చిన్న ఫంక్షన్ జరిగిన పెద్ద ఫంక్షన్ జరిగిన బాధ వచ్చిన ఆనందం వచ్చిన కచ్చితంగా డ్రింకు పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పనులు పెద్దవాళ్లు చేస్తూ ఉండడం వల్ల చిన్న పిల్లలు కూడా అలాంటి వాటిని చేస్తూ ఉన్నట్లు ఒక అధ్యయనంలో తెలియజేస్తోంది. అందుకే ఇంట్లో ఉండే చిన్నారుల సమయంలో ఆచితూచి ప్రతి ఒక్కరు అడుగు వేయాలని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు.

5 Of The Most Serious Alcohol-Linked Diseases - Alcohol Rehab Guide

ముఖ్యంగా మద్యానికి బానిసైన తల్లితండ్రుల పిల్లలు కూడా ఆ వ్యాసనానికి అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. తాజాగా ఒక పరిశోధన చేసి మరి ఈ విషయాన్ని తెలియజేశారు నిపుణులు. పెద్దలు చేసే పనుల వల్ల చిన్నారుల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వారి అలవాట్ల పైన దుష్ప్రభావం కూడా ఎక్కువగా చూపిస్తుందట. తల్లితండ్రులలో ఏ ఒక్కరికి మద్యం అలవాటు ఉన్నా సరే పిల్లలు మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉందని తాజా సర్వేలో తేలిందట.

ఇందులో భాగంగానే 2000 వేల మంది మద్యపానం అలవాటు ఉన్న తల్లితండ్రుల పైన సర్వే నిర్వహించడం జరిగిందట.. దాదాపుగా పదేళ్లపాటు ఈ సర్వే నిర్వహించిన తర్వాత ఈ విషయాలను తెలియజేశారు నిపుణులు. మద్యపానం సేవించి అలవాటు ఉన్న తల్లితండ్రుల పిల్లలు ప్రాసెస్ చేసిన ఆహారం తినాలని కోరిక విపరీతంగా పెరుగుతుందట. మంచి ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపరని తెలియజేశారు. మద్యం అలవాటు ఉన్న వారిలో పుట్టే పిల్లలను అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ తో పాటు, కార్బోహైడ్రేడ్ కొవ్వులతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలని కోరిక అధికంగా ఉన్నదని నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. చిన్న వయసులోనే బిపి గుండెకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు.