హీరోయిన్ నిత్య మీనన్ ని వేధించిన ఆ స్టార్ హీరో.. నిత్య షాకింగ్ కామెంట్స్ వైరల్..

టాలెంట్డ్‌ బ్యూటీ నిత్యమీనన్ టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటించింది. గోమత్ ఉపాధ్యాయన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సిరీస్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వప్న సినిమాస్ పై స్వప్న దత్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక రిలీజ్ డేట్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

అయితే ఇటీవల ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న నిత్యమీనన్ మాట్లాడుతూ కోలీవుడ్ స్టార్ హీరోకు సంబంధించిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నన్ను వేధించాడని తమిళ్ సినీ ఇండస్ట్రీ వల్ల నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది నిత్య. ప్రస్తుతం నిత్య చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.