డిజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి ప్రేమలో ఉందా.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లలో బిజీగా ఉన్న హీరోయిన్ నేహా శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది. మొదట మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కాలేక పోయింది.. కానీ డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ ని అందుకుంది నేహా శెట్టి.. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్లో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తరువాత టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించిన అవకాశాలని అందుకుంది.

 

ఇటీవలే కార్తికేయ తో బెదురులంక-2012 సినిమాతో మళ్లీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజాన్ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఆ తర్వాత విశ్వక్ తో కలిసి గ్యాంగ్ సాఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూనే ఉంటోంది. రూల్స్ రంజాన్ సినిమా అక్టోబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రేమ గురించి మాట్లాడడం జరిగింది.

యాంకర్ మీరు ప్రేమలో ఉన్నారా మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడగగా.. అతడిని చొప్పమంటూ ఈ వీడియోలో తెలిపింది దీంతో అయాంకర్ మీరు ప్రేమలో ఉండొచ్చు అని అంటే నవ్వుతూ చెప్పకుండా వదిలేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే మీ అభిమానుల నుంచి ప్రేమ గురించి ప్రేమ గురించి చెప్పండి అంటే నేహా శెట్టి.. లవ్ లో ఎలాంటి రూల్స్ ఉండవు కానీ రూల్స్ పెట్టుకుంటాము.. ఫాలో అవ్వము.. లవ్ అనేది ఒక మంచి ఫీలింగ్ ఎంతో హ్యాపీనెస్ రూల్స్ హద్దులు లవ్ లో ఉండవు.. చాలా బాగుంటుంది అంటూ తెలిపింది ఈ అమ్మడు. దీన్ని బట్టి చూస్తే నేహా శెట్టి కచ్చితంగా ప్రేమలో ఉందని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahendra borra (@rjmahionair)