ఫుట్ బాల్ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ తో కంపేర్ చేస్తే క్రికెట్ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ అంత తక్కువా..?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాధరణ కలిగిన క్రీడల్లో ఫుట్ బాల్, క్రికెట్ రెండు సరిసమానంగా ఉంటాయి. ఇక తాజాగా ఫుట్ బాల్ తో పోలిస్తే క్రికెట్ ప్రజాధరణ మరింతగా పెరిగిందని చెప్పాలి. పాశ్చాత్య దేశాల్లో సైతం క్రికెట్ విపరీతంగా క్రేజ్ దకించుకుంది. ప్రపంచంలో రెండు క్రీడలకు సరిసమానమైన క్రేజీ ఉన్న ఒక విషయంలో మాత్రం క్రికెట్ కి అన్యాయమే జరిగింది. ప్రైజ్ మనీ విషయంలో జెంటిల్మెన్ గేమ్ అయినా క్రికెట్ వెనకబడిపోయింది. ప్రపంచ కప్ విషయంలో ఫుట్బాల్ ప్రైజ్ మనీతో పోలిస్తే క్రికెట్ ప్రైజ్ మనీ చాలా తక్కువ ఉంది.

2022 ఫిఫా ప్రపంచ కప్ విన్నర్ అర్జెంటీనా ప్రైజ్ మనీ భారత్ కరెన్సీలో సుమారు రూ.334 కోట్లు కాగ.. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ విజేతకు రూ.33 కోట్ల మాత్రమే దక్కుతుంది. ప్రైజ్ మనీ విషయంలో రెండు క్రీడల మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో క్రికెట్ అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంత డబ్బు సంపాదిస్తున్న క్రికెట్ పై ఎందుకు ఇంత చిన్నచూపు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పటి నుంచో క్రికెట్ పై వివక్ష కొనసాగుతూనే ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ప్రజాదరణ విషయంలో ఫుట్బాల్ తో పోలిస్తే క్రికెట్లో ఏమాత్రం తీసిపోనప్పటికీ వారికి ఎందుకు ఇంత తక్కువ పారితోషకం అంటూ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా క్రికెటర్ వ్యక్తిగత పారితోషకం జట్టుకు అందే ప్రైజ్ మనీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.