అదే జ‌రిగుంటే విజయవాడ హైవేపై ఇడ్లీ కొట్టు పెట్టేవాడ్ని.. విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ లో విజ‌య్, స‌మంత జంట‌గా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్వ‌కుడు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే నిన్న హైద‌రాబాద్ లో జ‌రిగిన ఖుషి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ.. విజయవాడ హైవేపై ఇడ్లీ కొట్టు పెట్టేవాడ్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అస‌లేం జ‌రిగిందంటే.. ఖుషి షూటింగ్ మొద‌లైన కొద్ది రోజుల‌కే హీరోయిన్ స‌మంత మ‌యోసైటిస్ బారిన ప‌డి ఇంటికే ప‌రిమితం అయింది. దీంతో ఖుషి షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. చాలా నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ స‌మంత కెమెరా ముందు రావ‌డంతో.. చ‌కచ‌కా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఇదే విష‌యంపై ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే విజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `స‌మంత‌కు నేను పెద్ద ఫ్యాన్‌. ఆమె అద్భుతమైన వ్యక్తి. ఎంతో హార్డ్‌ వర్క్ చేస్తుంది. ఖుషిలో ఆరాద్య పాత్ర‌కు ఆమెను త‌ప్పితే మ‌రొక‌రిని ఊహించుకోలేము.

ఫస్టాఫ్ చిత్రీక‌ర‌ణ అయ్యేక.. స‌మంత వ‌ల్ల షూటింగ్ ఆగిపోయింది. ఆమె వచ్చే వరకూ వెయిట్‌ చేయాలనుకున్నాము. తను సినిమాకు ఎంత ప్రాణం పోస్తుందో తెలుసు. అందుకే ఆరు నెలలు కాదు.. అవసరమైతే పదేళ్లైనా వెయిట్ చేద్దామని నేను డైరెక్ట‌ర్ డిసైడ్ అయ్యాము. అయితే ఒక‌వేళ ఆమె రావ‌డానికి నిజంగా అంత స‌మ‌యం ప‌డితే.. ఈలోపు విజయవాడ హైవేపై సమంత పేరుతో ఇడ్లీ బండి పెట్టుకుందాంలే అని జోక్స్ వేసుకునేవాళ్లం. ఫైన‌ల్ గా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆమె వ‌చ్చింది. చాలా హ్యాపీ` అంటూ విజ‌య్ దేర‌వ‌కొండ చెప్పుకొచ్చింది. దీంతో ఇడ్లీ బండి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.