సెప్టెంబర్ పైన ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోయిన్స్.. సక్సెస్ వరించేనా..?

ఈ ఏడాది సెప్టెంబర్ నెల కోసం చాలామంది ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలే కాకుండా స్టార్ హీరోయిన్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అనుష్క, శృతిహాసన్, నయనతార ,సమంత వంటి వారు పలు చిత్రాలలో నటించడం చేత వీరి అభిమానులు కూడా సెప్టెంబర్ మీదే ఆశ పెట్టుకున్నారు. మరి వీరి యొక్క సినిమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samantha Ruth Prabhu to Tamannaah Bhatia; 10 most popular south cinema  actresses | Regional News – India TV

విజయ్ దేవరకొండ తో కలిసి సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. సమంత ఈ సినిమాతో నైనా సక్సెస్ కావాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు.

తన సినీ కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న నయనతార ఇప్పటివరకు సౌత్ లో లేడీస్ సూపర్ స్టార్ గా ఇమేజ్ను సంపాదించుకుంది.కానీ మొదటిసారి బాలీవుడ్లో జవాన్ సినిమాలో నటించింది. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది.

అనుష్క శెట్టి ,నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన చిత్రం మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి ..ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ.. అనుష్కకు సక్సెస్ రాక చాలా కాలం అవుతోంది. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

శృతిహాసన్ ,ప్రభాస్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం సలార్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత నీల్ తెరకెక్కిస్తూ ఉన్నారు . ఈ సినిమా కూడా సెప్టెంబర్ 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది..

ఎలాగైనా ఈసారి నయనతార అనుష్క సమంత సక్సెస్ కావాలని ట్రై చేస్తున్నారు ఈ ఏడాది రెండు సూపర్హిట్లు చూసిన శృతిహాసన్ ఫ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని తహతహలాడుతోంది.. మరి హీరోయిన్ల క్రేజీ సెప్టెంబర్ నెల మారుస్తుందేమో చూడాలి.