ఒకప్పుడు ఈ హీరోయిన్ సూపర్ పాపులర్.. ఇప్పుడు ఎలా తయారయిందో చూస్తే…

సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం లాంటిది. హవా ఉన్నంతకాలం మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఆ తరువాత ఎవరూ పట్టించుకోరు. గతంలో చాలా మంది హీరోయిన్లు చాలా ఏళ్ళ వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. కానీ ఇప్పుడు ఉన్నా జనరేషన్ లో మాత్రం హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాల్లో నటించిన ఆ తరువాత కనపడకుండా పోతున్నారు . అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్లుగా మారి ఆ తరువాత గుర్తుపట్టకుండా తయారవుతున్నారు. తాజాగా ఒక హీరోయిన్ గుండు చేయించుకుని మరీ అందరికీ షాక్ ఇచ్చింది. ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు ఉంది . అయితే ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2001లో వచ్చిన ‘రేపల్లెలో రాధ’అనే సినిమా ఎవరికీ పెద్దగా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. కానీ ఆ తరువాత 2003లో  వచ్చిన ‘బాపుబొమ్మకు పెళ్లంట’ అనే సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా లో రెండు జడలు వేసుకుని కుందనపు బొమ్మలా ఉన్న అమ్మాయే గాయత్రి రఘురామ్. ‘బాపు బొమ్మ’ సినిమాతో ఫేమస్ అయిన గాయత్రి తెలుగులో ఎక్కువ సినిమా లో నటించలేదు కానీ తమిళం లో మాత్రం కొన్ని సినిమాల్లో నటించింది. ఈమె ఇండస్ట్రీ కి వచ్చిన తరువాత కొంతకాలం 2004 నుంచి 2010 వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ లో కనిపించింది. మరికొన్ని సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో కనపడి ప్రేక్షకులను అల్లరించింది. అయితే 2021లో నితిన్ హీరోగా నటించిన ‘రంగ్ దే’ సినిమాలో హీరో సోదరిగా నటించింది. ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది.

2006లో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత గాయత్రి రఘురామ్, దీపక్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. పెళ్లి అయిన కొంతకాలనిలే గాయత్రి తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీలో కొంతకాలం కొనసాగారు. ఆ తరువాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. రాజకీయాల నుండి బయటికి వచ్చిన తరువాత ఆమెకు మళ్లీ సినీ ఇండస్ట్రీపై ఇష్టం ఏర్పడింది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని ఉపయోగించుకుంటు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఈ క్రమంలోనే ఆమె కొన్ని ఫొటోలు తీయించుకుంది. గుండు చేయించుకున్న గాయత్రి ని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.