పెళ్లికూతురుగా ముస్తాబైన హీరోయిన్ నందిత శ్వేత..!!

టాలీవుడ్ లోకి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు సుపరిచితమయ్యింది కన్నడ ముద్దుగుమ్మ నందిత శ్వేత.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫ్లాప్ సినిమాలలో నటించింది. ఈ మధ్యనే హిడింబ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అశ్విన్ తో రొమాన్స్ చేసి మరింత ఆకట్టుకుంది ఈ ముద్దు గుమ్మ.. ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నది ఓటీటి లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా నందిత శ్వేత రచ్చ చేస్తూనే ఉంటుంది. నిత్యం హాట్ ఫోటో షూట్లతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా పెళ్లికూతురు గెటప్పులో నందిత కనుల విందు చేస్తోంది. పెళ్లికూతురు అనగానే పెళ్లి అవుతుందని కాదు బ్రైడల్ ఫోటో షూట్ కోసం నందిత ఇలా పెళ్లికూతురుగా మారిందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తోంది

ఈ చానల్లో ఈమె తన బ్రైడల్ ఫోటోలను వీడియోను షేర్ చేయడం జరిగింది. బంగారు వర్ణంలో మెరిసిన చీరతో నిజంగానే బాపు బొమ్మల తయారయ్యింది నందిత.. ఈమె లుక్స్ చూస్తూ ఉంటే నిజంగానే పెళ్ళికూతురు అని భావన నిటిజన్లకు సైతం కలిగేలా కనిపిస్తోంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం త్వరగా వివాహం చేసుకోండి నందిత మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nandita Swetha (@nanditaswethaa)