శ్రీదేవి చ‌నిపోయిన 5 ఏళ్ల‌కు చివ‌కి కోర్కె తీర్చిన భ‌ర్త‌

అతిలోకసుందరి శ్రీదేవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అతి చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై ఇండస్ట్రీని ఓ ఊపుఊపిన హీరోయిన్స్‌లో శ్రీదేవి ఒకటి. 1980లో హీరోయిన్‌గా మంచి ఫామ్ లో ఉన్న టైంలో శ్రీదేవి చెన్నైకి దగ్గరలోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్ లో బీచ్ దగ్గర 5 ఎకరాల ప్లేస్ కొనుగోలు చేసింది.

 

అక్కడ తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఆమె అనుకునేది. దాని కోసం చాలా ఆశ ప‌డింది. కానీ 2018లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు ఆమె చనిపోయింది. దీంతో ఆ కల అలానే ఉండిపోయింది. శ్రీదేవి చివరి కోరికను భర్త బోనికపూర్ ఆమె చనిపోయిన ఐదేళ్లకు నెరవేర్చాడు. తాజ్ గ్రూప్ పార్ట్ న‌ర్‌షిప్‌తో అందమైన భవనం కట్టించాడు. ఆయన మాట్లాడుతూ ఇది శ్రీదేవి కల‌ అని అది నెరవేర్చడానికి రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేశామని ఫైనల్ గా బీచ్ హౌస్ ని పూర్తి చేశాం చాలా ఆనందంగా ఉంది అంటూ బోనీకపూర్ చెప్పుకొచ్చాడు.

ఇక బోనికపూర్ – శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు జాన్వి కపూర్ రెండవ కూతురు ఖుషి కపూర్. ఇక పెద్ద కూతురు జాన్వి కూడా తల్లికి లాగే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆమెబాటలోనే పయనిస్తుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.