మా ఎన్నికల విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు..!!

ప్రముఖ సినీ నటుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. రాబోయే మా ఎన్నికలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మా సర్వసభ్య సమావేశంలో మంచు విష్ణు ఈ నిర్ణయాన్ని సభ్యులతో సహా వివరించినట్లు సమాచారం.. రెండేళ్లకు ఒకసారి జరిగే మా ఎన్నికలు ఈసారి సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్నది అయితే అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించడం జరిగిందట..

Manchu Vishnu new MAA president, beats Prakash Raj | The News Minute

అంటే వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది.. అసోసియేషన్ ఆడిట్ సమస్యల కారణంగా ఈ ఎన్నికలు వాయిదా వేసినట్లుగా సమాచారం. ఎన్నికలు వచ్చేలోపు తను చెప్పిన హామీలను పూర్తిచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు మంచు విష్ణు.. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిసిన వెంటనే మా ఎన్నికలలో పోటీ చేయనని చెప్పడంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో మా ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే చాలా రసవత్తంగా జరిగాయి.

ఎలక్షన్లో మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ పైన విజయం సాధించడం జరిగింది. అయితే గెలుపోటములు కంటే ఎలక్షన్ జరిగిన తీరి అందరినీ చర్చనీయాంశంగా మారేలా చేసింది.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగా బ్రదర్స్ మద్దతుండగా మంచు విష్ణు విజయం కోసం కేవలం మోహన్ బాబు మాత్రమే రంగంలోకి దిగాడు.. పలు రకాల సవాళ్లు చేసుకోవడంతో పాటు తీవ్రమైన పదజాలంతా విమర్శలు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈసారి ఎవరెవరు పోటీకి దిగుతారో చూడాలి మరి.