మెగా ఫ్యామిలీని కలవరపెడుతున్న ఆడపిల్లలు…!

మెగా ఫ్యామిలి అంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుగు సినీ పరిశ్రమలో పైకి వచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఓ సాధారణ నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి… ఇప్పుడు తెలుగు పరిశ్రమను శాసించే స్థాయిలో ఉన్నారనేది వాస్తవం. అటు రాజకీయాల్లో కూడా చిరంజీవి రాణించారు. ప్రజారాజ్యం పార్టీతో అన్న చిరంజీవి… జనసేన పార్టీ పేరుతో తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే 9 మంది హీరోలున్నారు. వీరితో పాటు హీరోయిన్‌గా నిహారికా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా అల్లు అరవింద్ ఉన్నారు. ఇంత పెద్ద సినీ ఫ్యామిలీని ఇప్పుడు ఓ భయం వెంటాడుతోంది. అదే ఆడపిల్ల.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఆడపిల్ల సెంటిమెంట్‌గా మారిందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ముందుగా మెగాస్టార్ సోదరి, హీరో సాయిధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ భర్తతో విడిపోయారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే భర్తకు దూరంగా వచ్చిన విజయ దుర్గ… పిల్లలు ఓ స్థాయి వచ్చిన తర్వాత.. ఇటీవలే రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత. ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలోనే హీరో ఉదయ్ కిరణ్‌తో ప్రేమ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. దీనితో రెండు కుటుంబాలు వీరిద్దరికి నిశ్చితార్థం కూడా చేశారు. కానీ అనూహ్యంగా ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. తర్వాత సుస్మిత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. తర్వాత చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ. ఆర్య సమాజంలో ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ… నేరుగా మీడియా సంస్థకు వెళ్లడంతో చిరంజీవి కుటుంబం తలెత్తుకోలేక పోయింది. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆయితే ఆ యువకుడితో విడాకులు తీసుకున్న శ్రీజ మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. కానీ కొద్ది రోజులకు ఆ పెళ్లి కూడా పెటాకులైంది. చివరికి ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి దగ్గరే ఉంటోంది శ్రీజ.

ఇక చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్. టీవీలో యాంకర్‌గా వెలుగులోకి వచ్చిన నిహారికా… అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాప్ ప్లేస్‌లో ఉన్న సమయంలోనే నిహారికకు ఓ ఐపీఎస్ అధికారి కుమారుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. చైతన్య – నిహారిక పెళ్లిని రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు రెండు కుటుంబాల పెద్దలు. కొద్ది రోజుల పాటు సజావుగానే సాగిన వీరి కాపురం… ఇప్పుడు పట్టాలు తప్పింది. తాజాగా చైతన్యతో నిహారిక విడాకులు కూడా తీసుకున్నారు. దీంతో మెగా ఫ్యామిలీని ఆడపిల్ల సెంటిమెంట్ భయపెడుతోంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు రెండో వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.