ఆ హీరోయిన్ కు భ‌య‌ప‌డే న‌మ్ర‌త మ‌హేష్‌ను అంత హ‌డావుడిగా పెళ్లి చేసుకుందా?

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. వంశీ సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా.. చాలా రహస్యంగా ఉంచారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా 2005లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పట్లో మహేష్‌, న‌మ్ర‌త‌ పెళ్లి ఒక సెన్సేష‌న్‌. ఎందుకంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో సింపుల్ గా జరిగిపోవడం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది.

మ‌హేష్‌, న‌మ్ర‌త పెళ్లిపై అనేక వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే న‌మ్ర‌త మ‌హేష్‌ను అంత హ‌డావుడిగా పెళ్లి చేసుకోవ‌డానికి ఓ హీరోయినే కార‌ణ‌మ‌ట‌. స‌ద‌రు హీరోయిన్ కు భ‌య‌ప‌డే చాలా హ‌డావుడిగా మ‌హేష్ ను న‌మ్ర‌త త‌న సొంతం చేసుకుంద‌ట‌. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష. మ‌హేష్ బాబు-త్రిష కాంబోలో వ‌చ్చిన తొలి చిత్రం `అత‌డు`. 2005లో ఈ సినిమా విడుద‌లైంది.

అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో మ‌హేష్ బాబు, త్రిష బాగా క్లోజ్ అయ్యార‌ట‌. అప్ప‌ట్లో వీరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అని కూడా టాక్ న‌డిపించింది. ఈ విష‌యం కాస్త న‌మ్ర‌త‌కు తెలిసింద‌ట‌. అప్ప‌టికే మ‌హేష్‌, న‌మ్ర‌త ల‌వ్ లో ఉన్నారు. కానీ, పెళ్లి కాలేదు. ఇక త్రిష‌కు మ‌హేష్ క్లోజ్ అవుతున్నాడ‌ని తెలుసుకున్న న‌మ్ర‌త చాలా భ‌య‌ప‌డింద‌ట‌. అలాంటిదేమి లేదు అని మహేష్ క్లారిటీ ఇచ్చినా కూడా.. న‌మ్ర‌త వినకుండా వెంటనే పెళ్ళికి ఏర్పాట్లు చేయించింది అట. చేతి నిండా సినిమాలు ఉండ‌టం వ‌ల్ల.. అప్ప‌టికి మ‌హేష్ పెళ్లికి సిద్ధంగా లేడు. ఇక న‌మ్ర‌త ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. చేసేదేమి లేక ఆమెతో ఏడ‌డుగులు వేశాడ‌ని టాక్‌. ఇక వీరి పెళ్లి జ‌రిగిన త‌ర్వాతే అత‌డు రిలీజ్ అయింది.