డీజే టిల్లు ‘ నేహాశెట్టి ‘ రేటు పెంచేసింది… కొత్త రేటు ఇదే…!

నేహా శెట్టి డిజె టిల్లు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సొంతం చేసుకుంది. రాధికగా జనాలకు ఫుల్‌గా నచ్చేసిన నేహా ఆ తర్వాత సరైన సినిమా అవకాశాలు అందుకోలేదు. ఈ నెలలో రాబోతున్న బెదురులంక సినిమాపైనే నేహా శెట్టి ఆశలన్నీ ఉన్నాయి. పైగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన పబ్లిసిటీ చూస్తుంటే మూవీ మేకర్స్ కూడా నేహాను ఎంతవరకు చూపించాలో ఏ రోల్‌లో చూపించాలో ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు అర్థమవుతుంది.

ప్రస్తుతం ఈ సినిమాకి నేహా రెమ్యునరేషన్ ఎంత అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పెద్దగా సినిమాలు ఏమీ లేవు కాబట్టి నేహా శెట్టి రెమ్యూనరేషన్ విషయంలో తగ్గిందనుకునేరు.. డీజే టిల్లు హిట్ కావడంతో ఆమె ఫుల్ క్రేజ్ ద‌క్కించుకుంది. దీంతో బెదురులంక సినిమాకు పక్కగా రూ.50 ల‌క్ష‌లు రెమ్యూన‌రేషన్ తీసుకుంటుందట. దీనికి తోడు జీఎస్టీ, పర్సనల్ స్టాప్, ఇంకా ఇత‌రేత‌ర ఖర్చులు ఉండనే ఉంటాయి.

బెదురులంక సినిమాలో కార్తికేయ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం యానాం సమీపంలోని ఎదురులంకలో షూటింగ్ జరుపుకుంటుంది. మొత్తం అవుట్‌డోర్ షూటింగ్ కావడంతో చాలా మంది నటీనటులు కూడా ఈ సినిమాలో నటించడంతో దాదాపు రూ.13 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.