ఆ విష‌యంలో కొడుకు చెర్రీనే ఫాలో అవుతోన్న చిరు..!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీమిక్స్ సినిమాలు బాగా తెర మీదకు వస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేస్తుండడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మారిన కాలంలో రీమేక్ సినిమాలు వద్దు స్ట్రైట్ సినిమాలు ముద్దు అనుకుంటున్న కొంతమంది ఫిక్స్ అయ్యారు. అలాగే ప్రేక్షకులు కూడా పెద్దగా రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు. ఇదివరకులా ప్రేక్షకులు రీమేక్‌ సినిమాలకు థియేటర్లకి రావడం లేదు.

అందుకే హీరోల మార్కెట్ కూడా తగ్గుతుంది అని కొంతమంది అంటుంటే చిరంజీవి మాత్రం వరుస రీమిక్స్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. భోళా శంకర్ ఈవెంట్ లో ఈయన కొన్ని కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ను బట్టి చిరంజీవి త‌న కొడుకు చరణ్ ను ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది. గతంలో చరణ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇస్తూ తను ఇప్పుడు రీమే క్ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా లేనని ఒకవేళ చేయాల్సి వచ్చిన అది తెలుగులో రిలీజ్ కాకుండా.. ఏ ఓటిటిలో రిలీజ్ కాకుండా ఉండాలని అలా ఉంటేనే రీమేక్ సినిమా చేస్తానని తెలియజేశాడు.

మరి భోళాశంకర్ ఈవెంట్లో చిరు కూడా ఇదే సమాధానం ఇచ్చాడు. దీనితో ఈయన కొడుకు రామ్ చరణ్ ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు రీమేక్ వద్దు అనుకున్న చిరు ఆ తర్వాత చరణ్ సలహా మేరకే రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి భోళాశంకర్ ఈనెల 11న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.