మ‌హేష్ – న‌మ్ర‌త‌లో ఫ‌స్ట్ ప్ర‌పోజ్ చేసింది ఎవ‌రు… ఈ ప్రేమ‌క‌థ‌లో సూప‌ర్ ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా నటించి నిజజీవితంలో పెళ్లి బంధంతో ఒకటైన జంటలు ఎంతోమంది ఉన్నారు. అలా టాలీవుడ్ క్యూట్ కపుల్ అనగానే గుర్తుకు వచ్చే వారిలో మహేష్ బాబు – నమ్రత జంట ఒకటి. వంశీ సినిమా షూటింగ్లో వీరికి పరిచయం ఏర్పడింది. 2000 లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కానీ వీరిద్దరి ప్రేమ మాత్రం ఆ సినిమా షూటింగ్లోనే చిగురించింది. ఈరోజు మ‌హేష్‌ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక విషయానికొస్తే వంశీ మూవీ షూటింగ్ టైంలో అవుట్‌డోర్ షూటింగ్‌లో భాగంగా మూవీ టీం న్యూజిలాండ్ వెళ్లారట. దాదాపు 20 రోజులు పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం బలపడి ప్రేమగా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఫస్ట్ నమ్రతనే మహేష్‌కి ప్రపోజ్ చేసిందట. అప్పటికి నమ్రత అంటే మహేష్ కి కూడా ఇష్టం ఉండడంతో మహేష్.. నమ్రత ప్రపోజల్ ఓకే చేశాడట. కానీ వీరి ప్రేమను మొదట సూపర్ స్టార్ కృష్ణ అంగీకరించలేదు.

దీంతో మహేష్ సోదరి మంజుల సహాయం తీసుకున్నారు. నమ్రత మహేష్ కంటే 4 సంవత్సరాలు పెద్దది కావ‌డం.. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు పెళ్ళికి అంగీకరించలేదు. మంజుల సహాయంతోనే ఐదేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరి పెళ్లి జరిగింది. తెలుగు సాంప్రదాయ ప్రకారం చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబైకి వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నారు.

ఇక పెళ్లి తర్వాత మహేష్ బాబు కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఇక పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నమ్రత అటు కుటుంబ బాధ్యతలను ఇటు మహేష్ వ్యాపారాలను చూసుకుంటుంది.