మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రం మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర బృందం వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సైతం ఈ సినిమా హైపుని పెంచేశాయి చిరంజీవిని కొత్తగా ప్రజెంటేషన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తమిళంలో వేదాళం చిత్రానికి రిమెక్ గా తెలుగు నేటివిటికి తగ్గకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ఉత్సాహంతో అభిమానులు ఆనందం రెట్టింపు అవుతోంది. ఈ నేపథ్యంలోని ఈ సినిమా ఎలా ఉండబోతుందని విషయాన్ని ఈ సినిమా ఛాయాగ్రహుడు డడ్లి హింట్ ఇవ్వడం జరిగింది. గ్యాంగ్ స్టార్ సినిమాకి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో భోళా శంకర్ సినిమా అలా ఉంటుంది ఒకప్పటి చిరంజీవిని ఈ చిత్రంలో చూస్తారు..ఆయన స్టైల్ ఇమేజ్ కామెడీ టైమింగ్ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను కనువిందు చేస్తాయని తెలియజేశారు.
ఈ చిత్రంలో చిరంజీవి మరొకసారి యంగ్గా కనిపించడమే ఎందుకు ప్రత్యేకత అని ఈ సినిమా ప్రయాణంలో ఎక్కువగా సవాలు ఇచ్చిన అంశం ఏమిటంటే.. ఇంటర్వెల్ వచ్చే సన్నివేశం చాలా సవాలు విసిరిన సన్నివేశం వేదాళం సినిమాలో ఆ సన్నివేశం చాలా బాగా తీశారు అందుకు దీటుగానే ఈ సినిమాలో కొత్తగా ఉండేలా మేము ప్రయత్నం చేశామని విజువల్ గా ఈ సినిమా హైలైట్ అవుతుందని తెలియజేశారు. చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని పక్కా మాస్ సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.