డైరెక్టర్ పూరీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా.?

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరుపొందారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ పూరీ జగన్నాథ్ స్టైల్ , మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ సినిమాలలో డైలాగుల వల్లే హీరోలకు ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. పూరీ జగన్నాథ్ సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం ఎదురుచూస్తూ ఉంటారు.

The Robust, Rugged & Sturdy @ Puri Jagannadh | Medium

 

ఈ మధ్యకాలంలో పూరి జగన్నాత్ హవా కాస్త తగ్గినప్పటికీ మళ్లీ తన హవా కొనసాగించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది హీరోలను సైతం స్టార్ స్టేటస్ అందుకునేలా చేసిన పూరీ జగన్నాథ్ ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లను సైతం తెలుగు తెరకు పరిచయం చేస్తూనే ఉన్నారు. పోకిరి సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్రెట్ సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇందులో రామ్ పోతినేని హీరోగా నటిస్తూ ఉన్నారు.

Puri Jagannadh (Filmmaker) Wiki, Age, Biography, Girlfriends, Family,  Lifestyle, Hobbies, & More...

అయితే డైరెక్టర్ కాకముందు పూరి జగన్నాథ్ కథలను మాత్రమే రాసి దర్శకులకు ఇచ్చేవారట. అలా చాలామందికి కథలు రాసేవారట.. అలా 100 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారట పూరి జగన్నాథ్.. అంతేకాకుండా ఆ కథకు తగ్గట్టుగా షార్ట్ యానిమేషన్ బొమ్మలు కూడా గీసేవారట. ఇందుకుగాను వారానికి 50 రూపాయలు అందుకునే వారని సమాచారం. ఈ విషయాలన్నీ కూడా పూరీ జగన్నాథ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు పొందిన పూరీ జగన్నాథ్ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో బిజీగా ఉన్నారు.