ప్రేమ వార్తలపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన అను ఇమ్మాన్యయేల్..!!

మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత.. చాలామంది నటీమణులు సైతం తమ పైన లైంగికంగా బాధపడ్డ విషయాలను సైతం ఒక్కొక్కరుగా వెలుగులోకి తీసుకువస్తున్నారు.. సినీ పరిశ్రమలో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం పైన చాలామంది ఇప్పటివరకు స్పందించడం జరిగింది.. టాలీవుడ్ , కోలీవుడ్ ,బాలీవుడ్ ఏ భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమలో వాళ్లు కూడా ఇలాంటి విషయం పైన స్పందించారు. తాజాగా ఈ విషయం పైన స్పందించిన హీరోయిన్ అను ఇమ్మాన్యయేల్ గతంలో వినిపించిన ప్రేమ వార్తల పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Anu Emmanuel – South Indian film actress with hit debut films, 'Action Hero  Biju', 'Majnu' and 'Thupparivaalan' in three languages – My Words & Thoughts

తాజాగా అను ఇమ్మాన్యయేల్ కూడా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నదట.. జపాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యిందని తెలియజేసింది. కేవలం తమ కుటుంబ సభ్యుల కారణంగా ఈ సమస్య నుంచి బయట పడ్డానని తెలిపింది. ఈ మధ్యనే టాలీవుడ్ ఒక యంగ్ హీరోతో డేటింగ్ లో ఉన్నానంటు మీడియా కథనాలు వైరల్ గా చేశాయి. అయితే ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయకపోవడం పైన వాటి పైన స్పందించాల్సిన అవసరం రాలేదని తెలిపింది.

తాజాగా వాటిపైన క్లారిటీ ఇస్తూ అను ఇమ్మాన్యయేల్ మాట్లాడుతూ ఈ విషయం నాకు అమ్మ ద్వారా తెలిసింది ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతుంది. ఇలాంటి రూమర్లు వస్తున్నాయి ఏంటి అని చాలా బాధపడింది వాస్తవానికి ఆ హీరోని లాంచింగ్ డే రోజున మాత్రమే కలిశాను అప్పుడే స్నేహం మొదలయ్యింది.. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏం బంధం లేదంటూ తెలిపింది.. ప్రేమించే చనవు ఆకర్షణ లేవు పాత్రలు పండడానికి సినిమాలో కాస్త రియల్ స్టిక్ గా మాత్రమే నటించారని ఆమాత్రానికి ఏవేవో వార్తలు వచ్చాయి.. అంతేకాకుండా అంతకుముందే ఆ హీరో కుటుంబానికి చెందిన ఒక హీరోతో సినిమా చేశానని తెలిపింది అను ఇమ్మాన్యయేల్..