మూడు రోజుల్లోనే 2 పెళ్లిళ్లు చేసుకున్న అలియా భ‌ట్‌.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న‌ప్పుడే పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఏప్రిల్ లో ప్రియుడు, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ క‌పూర్ తో అలియా భ‌ట్ ఏడ‌డుగులు వేసింది. ముంబైలో వీరి వివాహం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వైభ‌వంగా జ‌రిగింది. అయితే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ర‌ణ్‌బీర్ క‌పూర్ ను పెళ్లి చేసుకున్న మూడు రోజుల‌కే అలిమా భ‌ట్ మ‌రొక హీరోను వివాహం చేసుకుంది.

ఆల‌స్యంగా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇక అస‌లు ట్విస్ట్ ఏంటంటే.. అలియా భ‌ట్ రెండోసారి పెళ్లి చేసుకుంది మ‌రెవ‌రినో కాదు బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ను. వీరి పెళ్లి జ‌రిగింది రియ‌ల్ గా కాదు.. రీల్ లైఫ్ లో జ‌రిగింది. వివాహం అనంత‌రం అలియా భ‌ట్ నుంచి వ‌చ్చిన తొలి చిత్రం ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. కరణ్ జోహార్ దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించారు. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

ఇక‌పోతే ఈ సినిమాలో ఆలియా, రణవీర్‌కు జరిగే పెళ్లి సీన్ చాలా గ్రాండ్‌గా తెరకెక్కింది. అయితే ఈ సీన్ గురించి తాజాగా క‌ర‌ణ్ జోహార్ ఓ ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ ను బ‌య‌ట‌పెట్టారు. అలియా భట్, రణ్ బీర్ కపూర్‎ల పెళ్లి అయిన మూడు రోజులకే.. ఆమె రాఖీ ఔర్ రాణి కా ప్రేమ్ కహాని సినిమా షూటింగ్ లో పాల్గొంది. అప్పుడే అలియా భ‌ట్, ర‌ణ్‌వీర్ పెళ్లిని షూట్ చేశారు. ఆ క్రమంలోనే అలియా భట్ మెడలో మళ్లీ తాళి కట్టాడు రణ్‌వీర్‌. అలా మూడు రోజుల్లోనే అలియా భ‌ట్ రెండు పెళ్లిళ్లు చేసుకుంది. ఏదేమైనా ఇలాంటి వింత అనుభ‌వం ఇంత‌వ‌ర‌కు మ‌రే హీరోయిన్ కు ఎదురై ఉండ‌దు.