సినీ ఇండస్ట్రీ లో నటినటుల పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన నటినటులు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీ కి దూరం అయ్యి తినడానికి తిండి కూడా లేకుండా రోడ్ల మీద ఉండే పరిస్థితి వచ్చింది. అలాంటి ధీన స్థితిలో వారిని చూసే వారు ఎవరు లేక చనిపోయిన నటినటులు చాల మందే ఉన్నారు. గతంలో ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకొన్న చాలామంది తారలు దీన స్థితిలో తనువు చాలించినవారిలో మహానటి సావిత్రి కూడా ఒకరు.
సావిత్రి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఎంతో గొప్ప స్థానం సంపాదించుకుంది. కానీ అనుకోని విధంగా కష్టాలపాలైంది. అలానే మరో తెలుగు నటి హీరోయిన్ గా 100 కు పైగా సినిమా లో నటించి ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగి చివరికి చికిత్స చేయించుకోడానికి కూడా డబ్బులు లేక మారించింది. ఆ నటి మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటి అశ్విని. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కు చెందిన అశ్విని హీరోయిన్ గ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో దాదాపు 100 కు పైగా సినిమాలో నటించింది. ‘భక్త ధ్రువ మార్కండేయ ‘ అనే సినిమా తో బాలనటిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఆ తరువాత హీరోయిన్ గా వెంకటేష్ తో ‘ కలియుగ పాండవులు ‘, రాజేంద్ర ప్రసాద్ తో ‘ స్టేషన్ మాస్టర్ ‘, రాజ్ శేఖర్ తో ‘ అమెరికా అబ్బాయి ‘ లాంటి ఎన్నో సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది.
తన నటనతో, అందంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అశ్విని ఎవరికి చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకొని చిక్కులో పాడింది. పెళ్లి అయిన కొంతకాలానికే భర్త విడిచిపెట్టి వెళ్లడం తో అశ్విని ని మానసికంగా బాగా కృంగిపోయింది. ఒంటరిగా ఉండలేక కార్తీక్ అనే బాబు ని దత్తత తీసుకొని పెంచుకుంది. ఇక ఆ తరువాత సినిమా లో అవకాశాలు తగ్గాయి. దాంతో బుల్లితెర పై సీరియల్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురి అయ్యింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన అశ్విని డబ్బు కూడబెట్టుకోలేకపోయింది. చివరికి ఆమె ఆరోగ్యం కోసం చెన్నై లో ఉన్న ఇల్లు ను కూడా ఆమేసింది. చిన్న చిన్నగా ఆరోగ్యం దెబ్బతిని 2012 సెప్టెంబర్ 23 లో అశ్విని తుదిశ్వాస విడిచింది.