నాగార్జున‌కు బాగా కోపం వ‌స్తే ఏం చేస్తాడో తెలుసా.. అస్స‌లు గెస్ చెయ్య‌లేరు!

టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒక‌రు. కేవ‌లం హీరోగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్ గా మ‌రియు వ్యాపార‌వేత్త‌గా నాగార్జున సూప‌ర్ స‌క్సెస్ అయ్యారు. మ‌న్మ‌థుడిగా కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్ప‌టికీ చెరిగిపోని ముద్ర‌ను వేసుకున్నాడు. హీరోగా ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. అన్ని జోన‌ర్ల‌ను ట‌చ్ చేస్తూ సినిమాలు చేశాడు. మ‌రోవైపు సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ముందుంటూ ఎంతో మందికి త‌న వంతు సాయం అందించారు.

అలాగే కెరీర్ ఆరంభం నుంచి వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు నాగార్జున ఎప్పుడూ దూరంగా ఉన్నాయి. పైగా అంద‌రితోనూ చాలా స‌ర‌దాగా ఉంటారు. ముఖంపై చిరున‌వ్వు చెర‌గ‌దు. రియ‌ల్ లైఫ్ లో ఆయ‌న్ను కోపంగా ఎప్పుడూ చూసుండ‌రు. ఎందుకంటే, నాగార్జున‌ స్వీట్ అండ్ కూల్ ప‌ర్స‌న్ అని అంద‌రి భావ‌న‌. కానీ, ఆయ‌న మ‌నిషేగా. కోపం, టెన్ష‌న్స్‌, చిరాకు.. ఇవ‌న్ని ఆయ‌న‌కీ ఉంటాయి. అయితే నాగార్జున‌కు బాగా కోపం వ‌స్తే ఏం చేస్తాడో తెలుసా.. అస్సలు గెస్ట్ చెయ్య‌లేరు.

ఈ విష‌యంపై ఆయ‌న త‌న‌యుడు అఖిల్ అక్కినేని ఓపెన్ అయ్యాడు. `నాన్న ఎక్కువ శాతం కూల్ గానే ఉంటాడు.. ఒకవేళ కోపం వ‌చ్చినా, మూడ్ బాగోక‌పోయినా వెంట‌నే కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తారు. కిక్కింగ్ లో నాన్న మంచి స్పెష‌లిస్ట్. మా అంద‌రినీ టేస్టీ ఫుడ్ ను ప్రిపేర్ చేస్తాడు. ఎప్పుడైనా నేను షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వ‌చ్చే స‌మయానికి నాన్న కిచెన్ ఉంటే మాత్రం నాకు అర్థ‌మైపోతుంది. ఆయ‌న కోపంలో ఉన్నార‌ని` అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. అద‌న్న‌మాట సంగ‌తి.. నాగార్జున‌కు బాగా కోపం వ‌స్తే ఆయ‌న కుక్కింగ్ చేస్తారు. కాగా, `ది ఘోస్ట్‌` విడుద‌ల త‌ర్వాత నాగార్జున నుంచి మ‌రో సినిమా అనౌన్స్‌మెంట్ రాలేదు. ప్ర‌ముఖ రైట‌ర్ ప్రసన్న కుమార్‌ బెజవాడను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ నాగ్ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని టాక్ ఉంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.