సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ల జాబితాలో శ్రియా ఒకటి. బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అయితే ఈ మధ్య సినిమాల కంటే గ్లామరస్ ఫోటోషూట్లతోనే శ్రియా వార్తల్లో నిలుస్తోంది. శ్రియాకు ఆల్రెడీ పెళ్లైంది. ఒక కూతురు కూడా పుట్టింది. అయినా ఎలాంటి మొహమాటం లేకుండా అన్నీ చూపించేస్తుంది.
తరచూ ట్రెండీ దుస్తుల్లో స్కిన్ షో చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా గ్రాజియా మిలీనియల్ అవార్డ్స్ 2023 లో పాల్గొన్న శ్రియా.. రెడ్ కలర్ మినీ డ్రెస్ లో మరోసారి అందాల అరాచకం సృష్టించింది.
చాలీ చాలని ఆ డ్రెస్ జారిపోయేలా ఉన్నాసరే శ్రియా మాత్రం ఒంపుసొంపులు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది `ఆర్ఆర్ఆర్`లో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసిన శ్రియా ఆ తర్వాత గమనం మూవీలో ఓ కీలక పాత్రను పోషించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది.