ఫ్రెండ్ తో కలిసి క్రేజీ డ్యాన్స్ చేసిన సమంత.. వీడియో వైరల్..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మయా చేసావే’ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది . ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించు అభిమానులను అల్లరించింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఇటీవల మాయొసైటీస్ అనే వ్యాధి బారిన పడి కోలుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

త్వరలోనే మాయోసైటీస్ వ్యాధి చికిత్స కోసం సామ్ విదేశాలకు వెళ్ళబోతుంది. అందుకే ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయిన ఖుషి, సిటడేల్ షూటింగ్స్ ని తొందరగా కంప్లీట్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే తాజాగా బాలి టూర్ కి వెళ్లిన సమంత ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. తన స్నేహితురాలయిన అనుష్క స్వామీతో కలిసి బాలి లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తుంది ఈ చిన్నది. ఆ టూర్ కి సంబందించిన విషయాలను ఫోటోలు , వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ సందర్బంగా తాజాగా సామ్ కొన్ని వీడియో లను షేర్ చేసింది.

వాటిలో ఒక వీడియో లో సమంత తన హోటల్ రూమ్ లో నుండి సూర్యుడు ని చూస్తూ కనపడింది. ఆ వీడియో కి ‘ ఈ ప్రదేశం భూతల స్వర్గం. అత్యంత అందమైన సూర్యోదయం ఇది ‘ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇక ఇంకొక వీడియో లో సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనపడింది. ఈ వీడియో కి ‘ గర్ల్స్ ట్రిప్ అంటే ఫుల్ ఫన్, ఎంజాయ్ తో నిండి ఉంటుంది  ‘ అంటూ క్యాప్షన్ పెట్టింది. సామ్ తన ఫ్రెండ్స్ తో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన సామ్ అభిమానులు ‘ మేడం మిమల్ని ఇలా చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది ‘అంటూ కామెంట్స్ చేస్తున్నారు.