రాశి ఖన్నా.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె చేసే హడావుడి నెక్స్ట్ లెవల్ లో ఉంటోంది. తరచూ ట్రెండీ దుస్తుల్లో స్కిన్ షో చేస్తూ నెట్టింట హీట్ పుట్టించేస్తోంది. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తూ రోజురోజుకు డోస్ పెంచేస్తోంది. తాజాగా దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా రాశి ఖన్నా దర్శనమిచ్చింది.
వైట్ కలర్ ట్రెండీ దుస్తుల్లో ఒంపుసొంపులు పోస్తూ కుర్రాళ్లు విలవిలమనేలా సోగసుల వల విసిరిసింది. నాజూకు నముడుతో సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. రాశి ఖన్నా తాజా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. రాశి ఇంత అందంగా ఉందేంట్రా బాబు అంటూ తల పట్టుకుంటున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. రాశి ఖన్నా తెలుగులో శర్వానంద్ కు జోడీగా ఓ సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ రాశి ఖన్నా నటించిన `ఫర్జీ` వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. దాంతో నార్త్ లోనూ ఈ బ్యూటీకి ఆఫర్లు తలుపుతున్నాయి. బాలీవుడ్ లో రాశి ఇప్పుడు `యోధా` అనే చిత్రంలో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది.
View this post on Instagram