సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్..!!

టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వారసురాలుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయింది జాన్వీ కపూర్.. కానీ అక్కడ అవకాశాలు అందుకున్న సరైన సక్సెస్ కాలేకపోతోంది. ఎన్టీఆర్ తో దేవర సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఈ సినిమా తర్వాత తమిళంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో బవాల్ సక్సెస్ సినిమా మంచి కిక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Jhanvi Kapoor Wiki, Age, Family, Boyfriend, Biography & More - WikiBio

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సౌత్ ఆడియన్స్ తనపై కురిపిస్తున్న ప్రేమాభిమానాల గురించి మాట్లాడడం జరిగింది జాన్వీ.. నితిస్ తివారీ దర్శకత్వంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం బవాల్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటి లో విడుదలయ్యింది. తన తల్లి వారసత్వం కారణంగానే సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఏమైనా టెన్షన్ గా ఫీల్ అయ్యారని ప్రశ్న యాంకర్ అడగగా.. అందుకు ఈ అమ్మడు స్పందిస్తూ సౌత్ ఇండస్ట్రీ తనకు సొంత ఇంటిలో అనిపిస్తుందని సొంత ఇంటికి వచ్చిన ఫీల్ కలుగుతోందని తెలియజేసింది.

When Janhvi Kapoor said how Sridevi didn't want her to be in films: 'She  thought I was naïve' | Bollywood - Hindustan Times

అంతేకాకుండా దక్షిణాది ప్రేక్షకుల నుంచి తనకు అపారమైన ప్రేమాభిమానాలు లభిస్తున్నాయని తెలియజేసింది.. మొదట ధకడ్ సినిమా చేస్తున్న సమయంలో మాత్రమే తాను కాస్త కంగారుపడ్డాను ఆ తర్వాత ఏ సినిమా సమయంలోనైనా సరే ఆందోళన చెందడం భయపడడం వంటివి మానేశాను.. కానీ సౌత్ నుంచి నాకు లభించే ప్రేమ అక్కడి వారి పలికే స్వాగతం విధానం చూసి నిజంగానే తన సొంత ఇంటికి వచ్చినట్టు అనిపించింది అని తెలిపింది. తన తల్లి కూడా తమిళంలో పుట్టి తమిళ్ తెలుగు భాషలలో స్టార్ గా ఎదిగి బాలీవుడ్ కి వెళ్ళింది. ఆమె ప్రేమ ఆదరణ తనకు కూడా లభించడంతో ఈ భావన కలుగుతోందని తెలియజేస్తోంది జాన్వీ.