ఏ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందం బాడీ ఫిట్నెస్ వంటివి కచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి.. అలా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ తమన్నా.. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ఈ మధ్యనే బాలీవుడ్ లో కూడా తన హవా చూపిస్తోంది.
తమన్నా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో స్పీడ్ తగ్గించిన యంగ్ హీరోల సరసన నటిస్తునే..సీనియర్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్ తో జైలర్ వంటి చిత్రాలలో నటిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.
కెరియర్ ప్రారంభంలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తెలియజేస్తూ.. సినిమాలలోకి వెళ్తానంటే కొంతమంది తనను హేళన చేశారట.. ముఖ్యంగా నీ మొహానికి హీరోయిన్ అవుతావా అని అన్నవాళ్లు చాలామంది ఉన్నారని చాలా ఎమోషనల్ అవుతూ తెలియజేసింది.. అయితే ఈ మాటలు తన సొంత కుటుంబ సభ్యుల అనడంతో చాలా బాధపడ్డాను అని తెలియజేస్తోంది.. కానీ తను ఎంచుకున్న ప్రొఫెషన్ లో పట్టుదలతో తానేంటో ఫ్రూట్ చేసుకున్నానని ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తూ ఉండడం చూసి వారే అభినందనలు తెలియజేస్తూ ఉన్నారని తెలుపుతోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.