పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారి మైథలాజికల్ సబ్జెక్ట్ ను టచ్ చేస్తూ చేసిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్వకత్వం వహించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. సన్నీ సింగ్, దేవదత్తా నాగె తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఎన్నో అంచానల నడుమ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడు వేల థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం.. తొలి నుంచే మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అదే సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. మరెన్నో వివాదాలు చుట్టుకున్నాయి. అయినాసరే ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లను రాబట్టింది. కానీ, ఇంతవరకు క్లీన్ మాత్రం కాలేదు.
ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ. 241 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగగా.. రూ. 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 76 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సొంతం చేసుకున్న ఆదిపురుష్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా షేర్ ను దక్కించుకుంది. ఇక ఇంతకు మించి వసూళ్లు రావడం కష్టమనే చెప్పాలి. ఫైనల్ గా ఈ సినిమాకు రూ. 60 కోట్ల రేంజ్ లో నష్టాలు రావడం ఖాయమని అంటున్నారు. కాగా, ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సలార్, ప్రాజెక్ట్-కె, స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఆల్రెడీ ఈ మూవీ కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.