ఫ్రెండ్ భ‌ర్త‌పైనే మోజు ప‌డుతున్నావా.. సిగ్గు లేదా.. స‌మంత‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత మ‌రింత జోరు చూపిస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అయితే బిజీగా ఉన్నా స‌రే స‌మంత సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ లో అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది.

తాజాగా త‌న ఫ్రెండ్‌, స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద భర్త రాహుల్ రవీంద్రన్ పై ప్రేమ కురిపిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అది కాస్త వివాదంగా మారింది. రాహుల్ ర‌వీంద్ర‌న్‌, చిన్మ‌యిల‌కు స‌మంత బాగా క్లోజ్ అన్న సంగ‌తి తెలిసిందే. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. కెరీర్ ఆరంభం నుంచి స‌మంత‌కు డ‌బ్బింగ్ చెప్పింది చిన్మ‌యినే. ఈ మధ్య మాత్రం స‌మంత త‌న సినిమాల‌ను తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా రాహుల్ రవీంద్రన్ ఫుడ్ తింటున్న కొన్ని ఫోటోల‌ను స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంది.

`మీకు తెలిసిన మంచి వ్యక్తిని తీసుకుని వంద సార్లు మ‌ల్టిప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్‌.. ఐ ల‌వ్యూ రాహుల్ రావింద్ర‌న్‌. నిన్ను ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను` అని త‌న పోస్ట్ లో స‌మంత రాసుకొచ్చింది. అంతేకాదు, రాహుల్ మంచి ఫుడీ అన్న‌ విష‌యాన్ని కూడా స‌మంత బ‌య‌ట‌పెట్టింది. ఎంత‌లా అంటే తాను తినేటప్పుడు పక్కవాళకు ఫుడ్ ఇవ్వాల్సి వస్తే చాలా బాధపడిపోతాడట. అయితే స‌మంత ఫ్రెండ్లీగానే రాహుల్ పై త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచినా.. యాంటీ ఫ్యాన్స్ మ‌రియు కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఫ్రెండ్ భ‌ర్త‌పైనే మోజు ప‌డుతున్నావా.. ఐ ల‌వ్యూ చెబుతావా.. సిగ్గు లేదా.. అంటూ స‌మంత‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/Ct1LEQiLcwu/?utm_source=ig_web_copy_link