అందాల భామ స్నేహా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గోపీచంద్ డబ్యూ మూవీ `తొలివలపు` మూవీతోనే స్నేహా కూడా సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డా.. స్నేహాకు మాత్రం ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా వరసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. వెంకటేష్, బాలకృష్ణ, శ్రీకాంత్, నాగార్జున వంటి ఆగ్రహీరోలతో ఆడిపాడింది.
తమిళంలోనూ పలు సినిమాలు చేసిన స్నేహా.. కోలీవుడ్ నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. అయినా పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా.. స్నేహా తన కెరీర్ ను కొనసాగిస్తోంది.
ఓవైపు అడపా తడపా చిత్రాల్లో సహాక పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ యాడ్స్ లో నటిస్తోంది. అంతేకాదు, 40 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని అందంతో చిత్రవధ చేస్తుంటుంది.
సోషల్ మీడియాలో తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో వావ్ అనేలా చేస్తుంది. తాజాగా కూడా ట్రెండీ డ్రెస్ లో అందంగా మెరిసిపోయింది. మత్తెక్కించే కళ్లతో పరేషాన్ చేసింది. స్నేహా తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి ఏముంది రా బాబు అంటూ స్నేహా అందాన్ని నెటిజన్లు పొగిడేస్తున్నారు.