ఎన్టీఆర్ తో నైనా సంతోష్ శోభన్ సక్సెస్ అయ్యేనా..?

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం అన్ని మంచి శకునములే… ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ విడుదల చేశారంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తారక్ అభిమానులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత స్వప్న దత్త కూడా ఎన్టీఆర్కు మంచి స్నేహితులు అందుకే ఈ ట్రైలర్ ని ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.

Anni Manchi Sakunamule (2023) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనే చిత్రం అన్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతొంది. హీరోయిన్గా మాళవిక నాయర్ నటించింది. ముఖ్యంగా ఇందులో హీరో హీరోయిన్లు పుట్టినప్పటినుంచి ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. అలా ఈ రెండు కుటుంబాల మధ్య సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది చాలా కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు సంతోషంగా ఉండాలని కుర్రోడు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది అనే కథ అంశంతో ఈ సినిమాని తలకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాల లవ్ స్టోరీ కూడా చాలా కొత్తగా కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని నందిని రెడ్డి దర్శకత్వం వహించగా మిక్కీ జేయయర్ సాంగ్స్ అందించారు.ఈ చిత్రం ఈనెల 18వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంతోష్ శోభన్ కి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest