వివాహం పై సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీకి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కోలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రావటం లేకపోయింది. కానీ లేడీ విలన్ గా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఈ అమ్మడు క్రేజ్ మరింత డబుల్ అయిందని చెప్పవచ్చు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన వివాహం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Pics! Varalaxmi Sarathkumar has a message on 'transformation' - Telugu News  - IndiaGlitz.com
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయాన్ని యాంకర్ ప్రశ్నించగా ఆమె చాలా తెలివిగా సమాధానాన్ని తెలిపింది.. అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి పెళ్లి చేసుకొని రోజు ఒకటే మొహమే చూడాలి రాజకీయాలలోకి రావాలని నా లక్ష్యం ప్రేమలేని పెళ్లిలో అర్థం అయితే లేదు.. ప్రేమించకుండా కూడా వివాహం చేసుకోలేను అంటూ పెను సంచలన వ్యాఖ్యలను చేసింది. దీంతో ఒక్కసారిగా అయాంకర్ షాక్కు గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వివాహం గురించి మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటూ యాంకర్ అనడంతో.. అందుకు తగినట్టుగానే సమాధానాన్ని తెలిపింది వరలక్ష్మి శరత్ కుమార్.

ఎవరో బలవంతం మీద ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండలేము కదా ప్రేమించి జీవితాంతం ఆ వ్యక్తితో ఉండాలని నిర్ణయించుకుంటే మనం వివాహం చేసుకోవాలి.. బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఎవరైనా ప్రశ్నించగలరా?. ఆడవాళ్ళకే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఆడవాళ్లు కూడా వారి కోసం వారు బతకగలరు.. సంపాదించుకోగలరు అలాగే వారికి ఏం కావాలో వారు చేసుకోగలరు అంటూ తెలిపింది వరలక్ష్మి శరత్ కుమార్. గతంలో కూడా ఒక హీరోతో ప్రేమాయణం నడిపి పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయింది అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ కామెంట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest