ఉపాస‌న బిడ్డ‌కు జ‌పాన్ దేశంతో సంబంధం.. బిగ్ సీక్రెట్ ను లీక్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌!

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. పెళ్లి జ‌రిగిన‌ పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

మరికొద్ది రోజుల్లోనే ఉపాసన డెలివరీ కాబోతోంది. అయితే తాజాగా అంతర్జాతీయ వేదిక జీ 20 సదస్సు కు హాజరైన రామ్ చరణ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఓ బిగ్‌ సీక్రెట్ చేశాడు. రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. త‌న‌ యూరప్ అంటే ఎంతో ఇష్టమ‌ని, కానీ ఇప్పుడు జపాన్ దేశాన్ని అమితంగా ఇష్టపడుతున్నాన‌ని. అక్కడి ప్రజలు, సంస్కృతి త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని తెలిపాడు.

అంతేకాదు, త‌న‌ భార్య ఉపాసనకు ప్రస్తుతం ఏడో నెల అని, త‌న‌కు పుట్టబోయే బిడ్డకు జపాన్ దేశంతో సంబంధం ఉంద‌ని ఈ మ్యాజిక్ అంతా జరిగింది జపాన్ లోనే అని రామ్ చ‌ర‌ణ్ చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ చ‌ర‌ణ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, గత ఏడాది అక్టోబ‌ర్ లో జపాన్ దేశంలో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ప్ర‌మోష‌న్స్ కోసం రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఉపాస‌న కూడా వెళ్లి అక్క‌డ వెకేష‌న్ ఎంజాయ్ చేశారు. ఇక అప్పుడే ఉపాస‌న గ‌ర్భం దాల్చింద‌ని రామ్ చ‌ర‌ణ్ తాజాగా వెల్ల‌డించాడు.

Share post:

Latest