డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం ఆయనది. విషయం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ప్రస్తుతం ఆయన `అహింస` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
రజత్ బేడీ, గీతిక, సదా, రవికాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. జూన్ 2న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ తేజ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కూతురు, కొడుకుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తన కొడుకును త్వరలోనే హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన తేజ.. కూతురు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మా అమ్మాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చింది. తనకు నేను పెళ్లి చేయను. నచ్చిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. పెళ్లయ్యాక భర్తతో పడకపోతే విడాకులు తీసుకోమని చెప్పాను. మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం. జనాలు ఏమనుకుంటున్నారు అనేది అనవసరమని పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటా` అంటూ తేజ బోల్డ్ కామెంట్స్ చేశారు. దీంతో ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.