శర్వానంద్ పెళ్లి పై క్లారిటీ ఇదే..అందుకే పెళ్లి ఆలస్యం..!

టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరుపొందిన శర్వానంద్ గత కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఆయన సంగతి అందరికీ తెలిసిందే..తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం రావడం జరిగింది. అయితే శర్వానంద్, రక్షితా రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలు కావస్తున్న ఇప్పటివరకు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే విషయంపై అభిమానులు చాలా సందిగ్ధత నెలకొన్నారు.

Sharwanand & Rakshita Reddy Engagement Video | Chiranjeevi, Ram Charan | Sharwanand  Marriage Video - YouTube
ఇలాంటి తరుణంలో తాజాగా శర్వానంద్ టీమ్ స్పందించినట్లు తెలుస్తోంది.. గత కొద్దిరోజులుగా శర్వానంద్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒట్టి రూమర్లే అంటూ కొట్టి పారేశారు.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కాలేదని శర్వానంద్ సినిమాలతో బిజీగా ఉన్నందువల్ల కాస్త సమయం తీసుకొని కమిట్మెంట్ అయిన చిత్రాలను పూర్తి చేసుకున్న తర్వాతే వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలియజేశారు. శర్వానంద్, రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారని ఎలాంటి వాదంతులు నమ్మద్దని తెలియజేశారు.

Ram Charan, Chiranjeevi, Nagarjuna, Rana Daggubati, and others At Sharwanand  And Rakshita's Engagement Ceremony - K4 Fashion
తాజాగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతొంది. ఇటీవలె లండన్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది.. శర్వానంద్ సినిమాలు పూర్తి అయిన వెంటనే..పెళ్లిపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తారని తెలియజేశారు. ప్రస్తుతం ఈ రెండు ఫ్యామిలీలు హైదరాబాదులోనే ఉన్నాయని త్వరలో ఈ రెండు కుటుంబాలు కలుసుకొని వివాహ తేదీని ప్రకటించబోతున్నట్లు శర్వానంద్ టీం తెలియజేశారు. దీంతో ఎట్టకేలకు శర్వానంద్ పై వస్తున్న రూమర్లకు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి మరి.

Share post:

Latest