త‌న్నులు తిన్నా మార‌ని సునిశిత్.. ఈసారి ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు!

సినీ తారల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పాపులర్ అయిన సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఇటీవల మెగా కోడలు ఉపాసనను కించపరస్తు దారుణమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దాంతో మెగా ఫ్యాన్స్ సునిశిత్ ను వెతికి పట్టుకొని మరీ చితక్కొట్టేశారు.

అయితే తన్నులు తిన్నా ఇతగాడు మారలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. సునిశిత్ కామెంట్స్ బాగా వైరల్ అవుతుండడంతో యూట్యూబ్ ఛానల్స్ కూడా అతడికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. దాంతో అత‌డు మ‌రింత రెచ్చిపోయి ఏది ప‌డితే అది వాగేస్తున్నాడు.

 

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. `నాకు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్.. అతను ఎంత పెద్ద హీరో అయినా స‌రే నీలి చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ వి నీలి చిత్రాలు ఉన్నాయి. హీరో సునిశిత్ కి మాత్రమే తెలిసిన నిజం ఇది. అది నేను ఒక్కడినే చెప్పగలను` అంటూ మరోసారి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైర‌ల్ గా మార‌డంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకైపోతారు. ఈ క్ర‌మంలోనే సునిశిత్ ను బండ బూతులు తిడుతూ ఏకేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాదిరిగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సునిశిత్ ను ఎటాక్ చేసే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు.

Share post:

Latest