నచ్చినోళ్ల‌తో చేయండి.. కానీ ఎవరికీ చెప్పొద్దంటూ ఛార్మీ షాకింగ్ పోస్ట్‌!

అందాల భామ ఛార్మీ కౌర్‌ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. అవకాశాలు తగ్గిన తర్వాత నిర్మాతగా మారింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. అయితే నిర్మాణ రంగంలో ఛార్మికి వ‌రుస షాకులు తగులుతూనే ఉన్నాయి.

ఇస్మార్ట్ శంకర్ మినహా ఈమె నిర్మించిన చిత్రాల్లో ఏ ఒక్క‌టి ఆశించిన స్థాయిలో విజయం సాధించ‌ లేదు. గత ఏడాది విడుద‌లైన `లైగ‌ర్‌`ను ఛార్మీ, పూరీ జ‌గ‌న్నాథ్‌ల‌ను ఘోరంగా దెబ్బ కొట్టింది. లైగ‌ర్ న‌ష్టాల నుంచి ఇప్ప‌టికీ వీరిద్ద‌రూ బ‌య‌ట ప‌డ‌లేక‌పోతున్నారు. ఇక ఇన్ని ఒడిదుడుకుల మ‌ధ్య ఛార్మీ త‌న బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకుంది.

మే 17న బర్త్ డే జ‌రుపుకున్న ఛార్మీ.. ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. చేతిలో వోడ్కా గ్లాస్ పట్టుకొని ఫోజిచ్చిన ఆమె.. లైఫ్ ని రహస్యంగా అనుభవించాలని కొటేషన్ పెట్టింది. `నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి, నచ్చిన వాళ్ళను ప్రేమించండి, నిజ‌మైన ప్రేమ‌ను పొందండి, ఆనందంగా జీవించండి.. కానీ ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఈ జనాలు మీ సంతోషాలు నాశనం చేస్తారు` అంటూ పోస్ట్ పెట్టింది. ఇది కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది. కాగా, `లైగ‌ర్‌` ఫ్లాప్ త‌ర్వాత ఛార్మీ-పూరీలు మ‌ళ్లీ రామ్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. త్వ‌ర‌లోనే వీరి ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌బోతోంది.