సుమ అడ్డా ఇలా అయిపోయిందేంటి.. ప్రేక్షకుల్లో భిన్న స్పందన

తెలుగులో యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. తరచూ సినిమా ఈవెంట్లలో హోస్టింగ్ చేస్తూ, నటీనటులను ఇంటర్వ్యూ చేస్తూ ఆమె ఆకట్టుకుంటోంది. వసపిట్టలా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆమె షోలకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఆమె షోలను చూస్తుంటారు. ఆమె మలయాళీ అయినప్పటికీ తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతుంటుంది. ఇదే ఆమెను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది.

అందుకే సినిమా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె సందడి చేస్తోంది. ఎక్కువ మంది సినీ సెలబ్రిటీలు ఆమెకే ఓటేస్తారు. ఆమె తమ సినిమాకు హోస్ట్ గా వ్యవహరిస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుందని చాలా మందికి నమ్మకం. ఇక టీవీ షోలలో కూడా ఆమె హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గతంలో ఈటీవీలో వచ్చే క్యాష్ ప్రోగ్రామ్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చేది. దాని స్థానంలో తీసుకొచ్చిన సుమ అడ్డా షోపై మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

గతంలో యాంకర్ సుమ ఆధ్వర్యాన సాగే క్యాష్ షోను ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే ప్రేక్షకులకు షాకిస్తూ ఈటీవీ యాజమాన్యం ఇటీవల సుమ అడ్డా షో తెరపైకి తెచ్చింది. కార్యక్రమం మొదట్లోనే చిరంజీవి అందులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఉండే కొద్దీ ఈ షో సినిమాలకు ప్రమోషన్ చేసే కార్యక్రమంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సుమ అభిమానులను ఇది ఆకర్షించడం లేదు. సుమ టాక్ షో అంటే చాలా మంది ఇష్టపడే వారు ఉన్నారు. గతంలో మాదిరిగా దీనిని టాక్ షోగా నిర్వహించాలని చాలా మంది కోరుతున్నారు. ఇక సుమ అడ్డా కార్యక్రమంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పటికైనా సుమ అడ్డా ప్రోగ్రామ్ షోను టాక్ షోగా నిర్వహించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. మరి ఈటీవీ యాజమాన్యం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share post:

Latest