మళ్లీ ట్రోల్స్ కు గురవుతున్న శ్రీవల్లి..!!

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ తెలియజేసింది. తాను ముందు నాన్ వెజ్ తినే దాన్ని కొన్ని కారణాలవల్ల వెజ్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేసింది .ఇకనుండి తాను వేజ్ ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నట్లు తెలియజేసింది. రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈమె పైన తీవ్రంగా విమర్శలు ఎదురవుతున్నాయి.

अभिनेत्रीने नॉनव्हेज खाल्लं अन् नेटकऱ्यांची सटकली! पाहा का ट्रोल होतेय रश्मिका मंदाना? – News18 लोकमत

తాజాగా ఈమె మెక్ డోనాల్డ్ ప్రకటన కోసం నాన్ వెజ్ బర్గర్ని ఇంట్లో ఉన్నట్టుగా చూపించారు. అది కాస్త వైరల్ గా మారుతోంది .ఈ వీడియో బుల్లితెరపై ప్రసారమవుతూ ఉండడంతో పాటు యూట్యూబ్లో కూడా ప్రసారం అవుతోంది. ఈ వీడియోలో రష్మిక చికెన్ ని తినడం చూసి చాలామంది ఈమె పైన ట్రోల్ చేస్తున్నారు.. గతంలో నాన్ వెజ్ ని మానేస్తున్నట్లుగా చెప్పావు ఇప్పుడు చేస్తోంది ఏంటి అంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్. రష్మిక ఒక అబద్ధాల కోరి అంటూ పాత వీడియోలను మరియు స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.

 

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రష్మిక అటు బాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. మరొకవైపు నితిన్ తో కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ రష్మిక పలు రూమర్స్ వల్ల మరే కారణాల చేత అయిన సరే ట్రోల్స్ కు గురవుతూనే ఉంది.

Share post:

Latest