జపాన్ లో రికార్డులు తిర‌గ‌రాస్తున్న `సింహాద్రి`.. అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్ర‌భంజ‌నం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న ఆయ‌న కెరీర్ లో ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` రీ రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్ష‌న్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం.. దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్స్ లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

తెలుగు రాష్ట్రాల్లో మూడు వంద‌లు, ఓవ‌ర్సీస్ లో 150 థియేట‌ర్స్ లో ఈ సినిమా మ‌ళ్లీ విడుద‌ల కాబోతోంది. అలాగే జసాన్‌లోనూ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌టం వ‌ల్ల‌.. అక్క‌డ కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ కాబోతున్న సింహాద్రికి ఏకంగా నాలుగు కోట్లు వెచ్చించి భారీ ఎత్తున ప్ర‌మోష‌న్స్ నిర్వ‌మిస్తున్నారు. మ‌రోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.

అయితే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ సినిమా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల కంటే ఓవర్సీస్, జ‌పాన్ లోనే అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా జ‌పాన్ లోనే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా 1 మిలియన్ జపనీస్ డాలర్స్ ని వసూలు చేసిందట. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 5 లక్షల రూపాయిల గ్రాస్ అన్నమాట.ఇది నిజంగా ఒక రికార్డ్ అనే చెప్పాలి. మ‌రి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు తిర‌గ‌రాస్తుందో చూడాలి.